కాసేపట్లో టీడీఎల్పీ సమావేశం.. బాబు టెన్షన్ అదే
ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు టీడీఎల్పీ సమావేశం జరగనుంది. [more]
;
ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు టీడీఎల్పీ సమావేశం జరగనుంది. [more]
ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఇప్పటికే ఈ సమావేశానికి హాజరవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సమాచారం అందించారు. అయితే వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ జరుగుతున్న వేళ ఎంతమంది ఈ సమావేశానికి హాజరవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. మరికొందరు పార్టీని వీడతారన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో టీడీఎల్పీ సమావేశానికి ఎంతమంది హాజరవుతారన్న టెన్షన్ టీడీపీ నేతల్లో ఉంది. ఉదయం 11 గంటలకు టీడీఎల్పీ సమావేశం జరగనుంది.