ఆగండి…..జీతాలొస్తాయి

సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ కార్మికులు 11 రోజులుగా సమ్మె చేపట్టింది. దీంతో ప్రభుత్వం వారికి ఈ నెల చెల్లించాల్సిన జీతాలను నిలిపివేసింది. జీతాలు చెల్లించాలంటూ హైకోర్టులో దాఖలైన [more]

Update: 2019-10-16 07:22 GMT

సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ కార్మికులు 11 రోజులుగా సమ్మె చేపట్టింది. దీంతో ప్రభుత్వం వారికి ఈ నెల చెల్లించాల్సిన జీతాలను నిలిపివేసింది. జీతాలు చెల్లించాలంటూ హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై కోర్టు విచారించింది. దీంతోతెలంగాణ ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో ఊరట లభించింది. గతనెల వేతనాలు చెల్లించేందుకు ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించింది. సోమవారం నాటికి జీతాలు చెల్లిస్తామని ఉన్నత న్యాయస్థానానికి ప్రభుత్వం తెలిపింది. సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో జీతాలు ఇచ్చేందుకు సిబ్బంది లేరని కోర్టుకు విన్నవించింది. సోమవారం లోపు కార్మికులకు జీతాలు ఇచ్చే ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పనిచేసిన సెప్టెంబర్‌ జీతాలు చెల్లించేలా ఆర్టీసీ యాజమాన్యానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఉన్నత న్యాయస్థానం ఈమేరకు ఆదేశాల్చింది. కోర్టు తీర్పుపై ఆర్టీసీ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

Tags:    

Similar News