సుప్రీమ్ కోర్ట్ ధర్మాసనానికి ట్రస్ట్ ఆహ్వానం

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఐదుగురు కీలకమైన తాజా, మాజీ న్యాయమూర్తులకు ఆహ్వానం అందింది. అయోధ్య రామమందిర నిర్మాణం విషయంలో ఏళ్ల తరబడి నానుతున్న వివాదానికి స్వస్తి పలికిన నాటి సుప్రీం కోర్లు ధర్మాసనం సభ్యులే వీరంతా.

Update: 2024-01-20 04:01 GMT

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఐదుగురు కీలకమైన తాజా, మాజీ న్యాయమూర్తులకు ఆహ్వానం అందింది. మసీదు, మందిరం విషయంలో ఏళ్ల తరబడి నానుతున్న వివాదానికి స్వస్తి పలికిన నాటి సుప్రీం కోర్లు ధర్మాసనం సభ్యులే వీరంతా.

అప్పటి దేశ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్‌ గొగోయ్‌, మాజీ సీజేఐ ఎస్‌.ఎ.బాబ్డే, ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడ్‌, మాజీ న్యాయమూర్తులు అశోక్‌ భూషన్‌, ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం 2019, నవంబరు 9న రామజన్మ భూమి ట్రస్టుకు అనుకూలంగా తీర్పు చెప్పింది. భూమినంతటినీ రామమందిరానికే కేటాయిస్తూ, మసీదు నిర్మాణానికి వేరే చోట స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఓ పెద్ద వివాదం సమసిపోయినట్లయింది. వెంటనే ట్రస్ట్‌ యుద్ధ ప్రాతిపదిక మీద మందిర నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ నెల 22న అంగరంగ వైభవంగా మందిర ప్రతిష్ట జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ధర్మాసనంలో ఉన్న ఐదుగురు సభ్యులకు కూడా రాముని వేడుకకు ఆహ్వానిస్తూ శుభలేఖలు అందాయి. న్యాయమూర్తులుగా పదవీ విరమణ చేసిన నలుగురిలో రంజన్‌ గొగోయ్‌ రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతుండగా, అబ్దుల్‌ నజీర్‌ ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. వీరితో పాటు యాభై మంది దాకా మాజీ, తాజా న్యాయమూర్తులు, ప్రముఖ న్యాయవాదులకు కూడా రామమందిర ప్రారంభానికి ఆహ్వానాలు అందాయి.

Tags:    

Similar News