బాబు, లోకేష్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

కోట్లాది మంది ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగతనం చేసి ఐటీ గ్రిడ్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించకపోతే చంద్రబాబు విచారణకు ఎందుకు భయపడుతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ [more]

Update: 2019-03-04 06:26 GMT

కోట్లాది మంది ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగతనం చేసి ఐటీ గ్రిడ్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించకపోతే చంద్రబాబు విచారణకు ఎందుకు భయపడుతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ… అడ్డంగా దొరికి పోవడం.. మిద్దెలెక్కి అరవడం చంద్రబాబు, ఆయన పుత్రరత్నం లోకేష్ కు అలవాటైందని, గతంలో కూడా ఓటు నోటు కేసులో కూడా దొరికిపోయి కూడా చంద్రబాబు ఇలానే రంకెలేశారని అన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు సిల్లీగా మాట్లాడుతున్నారు. ఏపీలోని కోట్లాది మందికి చెందిన వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు విచారణ ప్రారంభించారని తెలిపారు. ఫిర్యాదుదారుడు, కంపెనీ హైదరాబాద్ లోనే ఉన్నందున తెలంగాణ పోలీసులు విచారణ చేస్తున్నారని, అందులో ఎటువంటి తప్పూ లేదన్నారు. డేలా చోరీ నేరం జరగకపోతే ఏపీ ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని ప్రశ్నించారు.

డేటా చోరీ చేసినందుకు సిగ్గు పడాలి

ఆంధ్రా పోలీసులు ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లి నొటికొచ్చినట్లు దాడి చేసి, తిట్టాల్సిన అవసరం ఏముందన్నారు. చంద్రబాబు తప్పు చేసి ఉల్టా తెలంగాణ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారన్నారు. ఏపీ ప్రజలకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసుకుంటున్న, అమ్ముకుంటున్న చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు ఉందా అనేది ఏపీ ప్రజలే ఆలోచించాలన్నారు. ప్రభుత్వాన్ని నమ్మి ఏపీ ప్రజలు ఇచ్చిన సమాచారాన్ని ప్రైవేటు సంస్థకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తమకు వచ్చిన ఫిర్యాదు ప్రకారం తెలంగాణ పోలీసులు పక్షపాతం లేకుండా విచారణ చేస్తున్నారు. ప్రజల్లో పలుకుబడి కోల్పోయి గెలవలేనని చెప్పి చంద్రబాబు… కేసీఆర్ మీద, తెలంగాణ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం ద్వారా ఎన్నికల్లో గట్టెక్కాలనే ఆలోచన చేస్తున్నారని అన్నారు. ఆంధ్రా ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెబుతారనే భయంతోనే చంద్రబాబు విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. మాట్లాడితే రాసే రెండు పేపర్లు ఉన్నాయని చంద్రబాబు ఏది పడితే అది మాట్లాడుతారని, డేటా దొంగతనం చేసినందుకు వారు సిగ్గుపడాలి. తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కొని కడిగిన ముత్యాల్లా చంద్రబాబు, లోకేష్ బయటకు రావాలని కానీ కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. కేసును ఏపీకి బదలాయించడం సరికాదని, దొంగతనం చేసిన వారికే కేసును ఎలా అప్పజెపుతారని అన్నారు. చంద్రబాబు ఏది చేసినా సోషల్ మీడియా లేనప్పుడు నడిచింది కానీ ఇప్పుడు నడవదన్నారు.

Tags:    

Similar News