సౌత్ టూర్ కు సీఎం కేసీఆర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌య‌త్నాలను ప్రారంభించారు. ఇప్ప‌టికే రెండుసార్లు దేశ‌వ్యాప్తంగా ప‌లు ప్రాంతీయ పార్టీల నేత‌ల‌ను క‌లిసి ఈ మేర‌కు చ‌ర్చించిన ఆయ‌న [more]

Update: 2019-05-06 08:53 GMT

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌య‌త్నాలను ప్రారంభించారు. ఇప్ప‌టికే రెండుసార్లు దేశ‌వ్యాప్తంగా ప‌లు ప్రాంతీయ పార్టీల నేత‌ల‌ను క‌లిసి ఈ మేర‌కు చ‌ర్చించిన ఆయ‌న ఇప్పుడు మ‌రోసారి క‌ల‌వ‌నున్నారు. దేశంలో ఐదు ద‌శ‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత బీజేపీ, కాంగ్రెస్ కు ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు ద‌క్క‌వ‌ని భావిస్తున్న కేసీఆర్ మ‌రోసారి ప్రాంతీయ పార్టీల‌ను ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించాల‌ని భావిస్తున్నారు. ఈ మ‌ర‌కు ఇవాళ ఆయ‌న ద‌క్షిణాది రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరుతున్నారు. ముందు ఆయ‌న కేర‌ళ వెళ్లి ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య్ తో భేటీ అవుతారు. కేర‌ళ‌లోనే మూడు రోజులు ప‌ర్య‌టించిన త‌ర్వాత ఆయ‌న త‌మిళ‌నాడు వెళ్ల‌నున్నారు. అక్క‌డ స్టాలిన్ ను క‌లిసి దేశ రాజ‌కీయాల‌పై చ‌ర్చించ‌నున్నారు. వారం రోజుల పాటు కేసీఆర్ ప‌ర్య‌ట‌న జ‌రుగ‌నుంది. కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి ఆయ‌న ఇవాళ కేర‌ళ వెళుతున్నారు. రెండు రాష్ట్రాల్లోని ప్ర‌ముఖ పుణ్యక్షేత్రాల‌ను సైతం ఆయ‌న సంద‌ర్శించ‌నున్నారు.

Tags:    

Similar News