తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేతలు కలలో కూడా ఊహించని విధంగా ఘోర పరాజయం పాలయ్యింది. కచ్చతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా ఉన్న కాంగ్రెస్ నేతలకు ఇవాళటి ఫలితాలు షాక్ ఇచ్చాయి. పోలింగ్ కి ముందు గెలుపుపై ధీమాగా ఉన్న ఆ పార్టీ.... పోలింగ్ తర్వాత కనీసం హంగ్ అయినా ఏర్పడుతుందని ఆశించింది. కానీ, ఏకపక్షంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను ఓడించి టీఆర్ఎస్ కు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు.
రాజీనామా చేస్తారా..?
అయితే, ఈ ఓటమికి పూర్తి బాధ్యత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. గెలుపైనా ఓటమైనా తనదే బాధ్యత ఉన్నారు. ఇక తాజాగా ఆయన కాంగ్రెస్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. ఆయన హుజూర్ నగర్ లో ఆధిక్యంలో ఉన్నా... ఆయన సతీమణి పద్మావతి మాత్రం ఓటమి అంచున ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఘోర ఓటమికి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించే అవకాశం ఉంది. ఆయన పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకునే అవకాశం లేకున్నా పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.