వంశీ మట్లాడుతుండగా చంద్రబాబు?
గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మాట్లాడుతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయనతోపాటు టీడీపీ సభ్యులు కూడా బయటకు వెళ్లిపోయారు. వల్లభనేని [more]
గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మాట్లాడుతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయనతోపాటు టీడీపీ సభ్యులు కూడా బయటకు వెళ్లిపోయారు. వల్లభనేని [more]
గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మాట్లాడుతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయనతోపాటు టీడీపీ సభ్యులు కూడా బయటకు వెళ్లిపోయారు. వల్లభనేని వంశీకి స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీ ప్రసంగం పూర్తయిన తర్వాతనే తిరిగి చంద్రబాబు సభలోకి వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు ఇది శాసనసభా? వైసీపీ కార్యాలయమా? అని వ్యాఖ్యానించారు. దీనిని స్పీకర్ తమ్మినేని సీతారాం అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఆగ్రహం చెందారు. దేవాలయం లాంటి శాసనసభను పట్టుకుని వైసీపీ కార్యాలయం అని వ్యాఖ్యానించడాన్ని స్పీకర్ తప్పుపట్టారు. ఆ పదాన్ని తొలగిస్తున్నట్లు సభలో ప్రకటించారు. తనకున్న పరిమిత, అపరమిత అధికారాలేమిటో తెలుసునని స్పీకర్ తెలిపారు. గతంలో ఉన్న ప్రొసీడింగ్స్ ను ఒకసారి తెలుసుకోవాలన్నారు.
అభ్యంతరం చెప్పిన అచ్చెన్న…..
ప్రశ్నోత్తరాల సమయాన్ని పక్కన పెట్టి వల్లభనేని వంశీ చేత మాట్లాడించడంపై టీడీపీ ఉప నేత అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పార్టీ సభ్యుడిచేత ప్రతిపక్ష నేతను తిట్టించడం బాధాకరమన్నారు. వన్ సైడ్ గా స్పీకర్ వ్యవహరించడం సరికాదన్నారు. ఈరోజు సభలో జరిగిన తీరు అభ్యంతరకరమన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ తాము కలిశామని నియోజకవర్గ అభివృద్ధి పనులను కేటాయించమంటే అంగీకరించలేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి అందరి వాడని, ఎవరైనా కలవవచ్చని, ఈకొత్త సంప్రదాయానికి 2014 నుంచి చంద్రబాబు తెరతీశారన్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ నియోజవకర్గ అభివృద్ధి నిధులు కేటాయిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.