బాబుకు పులివెందుల ఫోబియా
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో విమర్శలకు దిగారు. ఉత్తరాంధ్ర ప్రజలంటే చంద్రబాబుకు చులకన భావమని అన్నారు. పులివెందుల ఫోబియా ఉందని [more]
;
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో విమర్శలకు దిగారు. ఉత్తరాంధ్ర ప్రజలంటే చంద్రబాబుకు చులకన భావమని అన్నారు. పులివెందుల ఫోబియా ఉందని [more]
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో విమర్శలకు దిగారు. ఉత్తరాంధ్ర ప్రజలంటే చంద్రబాబుకు చులకన భావమని అన్నారు. పులివెందుల ఫోబియా ఉందని తక్షణం ప్రపంచ ఆరోగ్య సంస్థ నోటిఫై చేయాలని విజయసాయిరెడ్డి కోరారు. ఇద్దరు కొట్టుకున్నా దానికి పులివెందుల పేరును చంద్రబాబు తీసుకువస్తున్నారన్నారు. అమరావతి నుంచి రాజధాని తరలించవద్దంటూ ఉత్తుత్తి ఉద్యమాలు చేసే చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజలను కూడా రెచ్చగొడుతున్నారని అన్నారు. ఉత్తరాంద్ర ప్రజలకు ఇంకా అన్యాయం జరగాలని చూస్తున్నావా? అని ప్రశ్నించారు.