నిమ్మగడ్డ కాదు.. నారా వారి తోక

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నారా వారితోకలాగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేయడమేంటని ప్రశ్నించారు. ఎన్నికలను [more]

;

Update: 2020-03-15 13:05 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నారా వారితోకలాగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేయడమేంటని ప్రశ్నించారు. ఎన్నికలను వాయిదా వేసి అధికారులను ఎలా బదిలీ చేస్తారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పినట్లే నిమ్మగడ్డ రమేష్ కుమార్ నడుచుకుంటున్నారన్నారు. కరోనా కంటే నిమ్మగడ్డ రమేష‌ కుమార్ డేంజర్ అని విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారుల పట్ల తనకు గౌరవం ఉందని, కుట్రలో భాగంగానే ఎన్నికలను వాయిదా వేశారన్నారు. టీడీపీని బతికించడం కోసమే ఎన్నికలను వాయిదా వేశారన్నారు. ఆయన పై కేంద్రానికి, కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News