శాసన మండలి త్వరలో రద్దు కాబోతోంది
చంద్రబాబుకు మానవ విలువలు లేవని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబుకు కుటుంబ విలువలు కూడా లేవన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగానే ఫీలవుతున్నారని చెప్పారు. [more]
;
చంద్రబాబుకు మానవ విలువలు లేవని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబుకు కుటుంబ విలువలు కూడా లేవన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగానే ఫీలవుతున్నారని చెప్పారు. [more]
చంద్రబాబుకు మానవ విలువలు లేవని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబుకు కుటుంబ విలువలు కూడా లేవన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగానే ఫీలవుతున్నారని చెప్పారు. చంద్రబాబు చంద్రముఖిలా మారాడన్నారు. ముత్యాల ముగ్గు బృందం ఆయననే సీఎం అని ప్రశంసిస్తుందంటున్నారు. లాక్ డౌన్ లో చంద్రబాబు లాక్ అప్ లో ఉన్నారన్నారు. చినబాబు సైకిల్ తొక్కాలని తెగ ఆరాటపడుతున్నారన్నారని, కానీ చంద్రబాబు సైకిల్ దిగడం లేదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. శాసనమండలి కూడా రద్దు కాబోతుండటంతో లోకేష్ సంగతి ఏంటని చంద్రబాబుకు దిగులు పట్టుకుందన్నారు. ఫ్యామిలీలో ఫ్రస్టేషన్ వల్లనే చంద్రబాబు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. లోకేష్ పరిస్థిితి అగమ్య గోచరంగా తయారయిందన్నారు. పార్టీ అధ్యక్షుడిది అవ్వాలనుకున్నా చంద్రబాబు ఇవ్వడం లేదన్నారు. కుటుంబ సభ్యుల వత్తిడితో చంద్రబాబు లాక్ అప్ లో ఉన్నారన్నారు. చంద్రబాబుకు కరోనా కంటే కుటుంబ సమస్యలే భయపడపెతున్నాయన్నారు.