త్వరలో జగన్ మరో నిర్ణయం

ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేసి వైఎస్ జగన్ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా విశాఖను ఎంపిక [more]

Update: 2019-12-21 06:19 GMT

ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేసి వైఎస్ జగన్ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా విశాఖను ఎంపిక చేసి జగన్ ఉత్తరాంధ్ర అభివృద్ధిని కాంక్షించారన్నారు. విశాఖ వైసీపీ పార్టీ కార్యాలయంలో జగన్ పుట్టిన రోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే జగన్ ఉద్దేశ్యమని వివరించారు. త్వరలోనే కొత్త జిల్లాల ఏర్పాటును కూడా జగన్ ప్రకటిస్తారన్నారు. మొత్తం ఏపీలో 25 జిల్లాల ప్రకటన త్వరలోనే ఉంటుందని ఆయన తెలిపారు.

Tags:    

Similar News