ప్రధాని నరేంద్ర మోదీ పై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీని ఒక అనకొండగా యనమల పేర్కొన్నారు. ఆయనను మించిన అనకొండ దేశంలో ఎవరూ లేరని యనమల అభిప్రాయపడ్డారు. మోదీ దాదాపు దేశంలోని అన్ని సంస్థలను స్వాహా చేస్తున్నారన్నారు. ముఖ్యంగా సీబీఐ, ఈడీ, ఆర్.బి.ఐ. వంటి సంస్థలను ఆయన స్వతంత్రంగా పనిచేయకుండా అడ్డుకుంటున్నారన్నారు. వాటిని కూడా మోదీ మింగేస్తున్నారని యనమల విరుచుకుపడ్డారు. అయితే యనమల కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఒక పార్టీకి వ్యతిరేకంగా పుట్టలేదని, వ్యవస్థలో ఉన్న రుగ్మతలను పారదోలేందుకే పుట్టిందని కొత్త నిర్వచనం చెప్పారు. గతం వర్తమానమూ కాదని, వర్తమానం భవిష్యత్తూ కాదని ఆయన అన్నారు.