యాత్ర సినిమాపై విజయమ్మ స్పందన

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన ‘యాత్ర’ సినిమా విశేష ప్రజాధరణ పొందుతోంది. ఈ చిత్రానికి మొదటి షో నుంచే పాజిటీవ్ టాక్ [more]

;

Update: 2019-02-11 12:03 GMT

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన ‘యాత్ర’ సినిమా విశేష ప్రజాధరణ పొందుతోంది. ఈ చిత్రానికి మొదటి షో నుంచే పాజిటీవ్ టాక్ రావడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. తాజాగా, ఈ చిత్రంపై వైఎస్సార్ సతీమణి వై.ఎస్.విజయమ్మ స్పందించారు. ఇవాళ సినిమా తిలకించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ… పాదయాత్ర ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కోట్లమంది గుండెల్లో ఉన్న వైఎస్ ను, ఆయన వ్యక్తిత్వాన్ని, ప్రజల కోసం ఆయన పడిన తపనను మరోసారి యాత్ర సినిమా ద్వారా మనముందుకు తీసుకువచ్చారని ఆమె పేర్కొన్నారు.

Tags:    

Similar News