ఎన్నికోట్లు ఖర్చు పెట్టినా అమరావతిని?
రాజధాని తరలింపులో తొందరలేదని ముఖ్యమంత్రి జగన్ మంత్రి వర్గ సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిసింది. అమరావతిలో ఎన్నికోట్లు ఖర్చు పెట్టినా అభివృద్ధి చేయలేమని సమావేశంలో జగన్ చెప్పినట్లు సమాచారం. [more]
రాజధాని తరలింపులో తొందరలేదని ముఖ్యమంత్రి జగన్ మంత్రి వర్గ సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిసింది. అమరావతిలో ఎన్నికోట్లు ఖర్చు పెట్టినా అభివృద్ధి చేయలేమని సమావేశంలో జగన్ చెప్పినట్లు సమాచారం. [more]
రాజధాని తరలింపులో తొందరలేదని ముఖ్యమంత్రి జగన్ మంత్రి వర్గ సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిసింది. అమరావతిలో ఎన్నికోట్లు ఖర్చు పెట్టినా అభివృద్ధి చేయలేమని సమావేశంలో జగన్ చెప్పినట్లు సమాచారం. సచివాలయం తరలింపు ఎందుకో దాదాపు అరగంట పాటు జగన్ మంత్రులకు వివరించినట్లు తెలిసింది. అమరావతిని అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్లు అవసరమని, అందులో పదిశాతం ఖర్చు పెట్టినా విశాఖను హైదరాబాద్ కు దీటుగా తీర్చిదిద్దవచ్చని జగన్ సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. రాజధాని మార్పు ఎందుకో ప్రజలకు చెప్పే చేద్దామని జగన్ అన్నట్లు చెబుతున్నారు. జనవరిలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి అందులోనే రాజధాని మార్పును ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. రాజధానిపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించినట్లు తెలిసింది.