నీటి వివాదంపై ఆ ఇద్దరికీ జగన్ లేఖ

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీకి, జలవనరుల శాఖమంత్రి షెకావత్కు లేఖ రాశారు.ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలని [more]

Update: 2021-07-02 02:18 GMT

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీకి, జలవనరుల శాఖమంత్రి షెకావత్కు లేఖ రాశారు.ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలని జగన్ తన లేఖలోకోరారు. మొత్తం 14 పేజీల లేఖను జగన్ రాశారు. శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుత్తు ఉత్పాదన చేస్తుందని జగన్ ఆరోపించారు. కేఆర్ఎంబీ ఆదేశించినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. నాగార్జున సాగర్ లో నీటిమట్టం తక్కువగా ఉన్న విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చర్యలు అంతరాష్ట్ర సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయని జగన్ తన లేఖలో తెలిపారు. వెంటనే జోక్యం చేసుకోవాలని జగన్ కోరారు.

Tags:    

Similar News