విన్నాను… ఇచ్చాను

పదేళ్ల తరువాత సోమశిల నీటితో కళకల లాడుతోందని, దేశంలోనే రైతులకు అత్యధికంగా సాయం అందించే పథకం రైతు భరోసానేనని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ అన్నారు. అన్నదాతల్లో ఆత్మస్థైర్యాన్ని [more]

Update: 2019-10-15 07:43 GMT

పదేళ్ల తరువాత సోమశిల నీటితో కళకల లాడుతోందని, దేశంలోనే రైతులకు అత్యధికంగా సాయం అందించే పథకం రైతు భరోసానేనని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ అన్నారు. అన్నదాతల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఆర్థిక సహాయం అందించే ‘వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌’ పథాకాన్ని నెల్లూరు జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అన్నదాతలకు అండగా ఉంటానని ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో ఇచ్చిన మాట ప్రకారం అన్నదాతలకు చేయూతనిచ్చే రైతు భరోసా పథకాన్ని నెల్లూరు జిల్లా నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నానని జగన్ సంతోషం వ్యక్తం చేశారు. మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా రైతన్నలకు ఇంకా మెరుగులు దిద్ది రైతు భరోసా తీసుకువస్తున్నామన్నారు జగన్. నా పాదయాత్రలో గ్రామగ్రామాన రైతుల ఆవేదనను చూశానన్నారు జగన్. వర్షాలు లేక రైతులు అల్లాడిపోయిన ఘటనలు చూసి తల్లడిల్లిపోయానన్నారు వై.ఎస్.జగన్.

 

Tags:    

Similar News