రాష్ట్రపతి ప్రసంగంపై వైసీపీ అసంతృప్తి

పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రపతి ప్రసంగంపై ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో [more]

;

Update: 2019-01-31 08:05 GMT

పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రపతి ప్రసంగంపై ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రపతి ప్రసంగం పూర్తిగా నినరుత్సాహపరిచిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏ అంశాన్ని కూడా రాష్ట్రపతి ప్రస్తావించలేదని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి సవరణలు ప్రతిపాదిస్తామని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ ను కచ్చితంగా ఇచ్చితీరాలని, రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని వైసీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News