ఒమన్ నుంచి రోమ్ వెళుతున్న ఖతార్ ఎయిర్ వేస్ విమానం శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. కో పైలట్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో విమానాన్ని హైదరాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బాధితుడ్ని అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడిని ఇటలీకి చెందిన డినే ఆండ్రోగా గుర్తించారు.