హర్యాన్యా ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. పంచకుల తగలపడిబోతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుందని అభిప్రాయపడింది. ఇన్ని వందల వాహనాలను పంచకులకు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించింది. హర్యానా సర్కార్ రాజకీయ వత్తిళ్లకు లొంగిందని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హర్యానా సీఎంకు హైకోర్టు తీవ్రస్థాయిలో అంక్షింతలు వేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం పట్టణాన్నే తగులబెట్టేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. పదుల సంఖ్యలో ప్రాణాలు పోల్పోతున్నా పట్టించుకోవడం లేదంది. హైకోర్టు వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్థించింది. హర్యానా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా బాబా అనుచరులు ఇద్దరిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. హర్యానాకు చెందిన డీఎస్పీని సంఘటనకు బాధ్యుడిని చేస్తూ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.