కూకట్‌పల్లి ధరణినగర్‌ను కాలుష్యపు నురగ ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఎడతెరపి లేకుండా కుండపోతగా వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాగా... కూకట్‌పల్లి ధరణినగర్‌కు సమీపంలోగల పరికి చెరువు నుంచి భారీగా కాలుష్యపు నురగ వెలువడుతోంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దఎత్తున వస్తున్న ఈ నురగ వల్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక ఇళ్ళలోనే చిక్కుకున్నారు. ఘాటైన వాసనలు రావడం తీవ్ర ఇబంది పడుతున్న ప్రజలు, నురగ నుంచి రక్షించాలంటూ ఆ ప్రాంతపు ప్రజలు అధికారులకు కోరుతున్నారు.ఎన్ని సార్లు పొల్యూషన్ అధికారులకు చెప్పినా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని డీసీ దశరథ్ తెలిపారు.