నేడు వైసీపీ ఆత్మీయ బీసీ సమావేశం
తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు బీసీల ఆత్మీయ సమావేశం జరగనుంది;
తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు బీసీల ఆత్మీయ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఈ సభ జరగనుంది. ఈ సభలో బీసీ సామాజికవర్గానికి చెందిన మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా పాల్గొననున్నారు.
సంక్షేమ పథకాలతో పాటు...
వైసీపీ ప్రభుత్వం బీసీలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు చేయాల్సిన ప్రయత్నాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు ఆర్థికంగా, రాజకీయంగా ఎంత మేర ప్రయోజనం చేకూర్చిందన్న విషయంపై కూడా చర్చించి దానిని ఆ వర్గం ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ప్రయత్నమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఈ సమావేశంలో బీసీలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.