మరోసారి ఆనందయ్య మందు వివాదం

ఒమిక్రాన్ వేరియంట్ కేసులు విజృంభిస్తున్న వేళ మరోసారి ఆనందయ్య మందు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది.;

Update: 2021-12-24 14:24 GMT

ఒమిక్రాన్ వేరియంట్ కేసులు విజృంభిస్తున్న వేళ మరోసారి ఆనందయ్య మందు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒమిక్రాన్ కు కూడా తన వద్ద మందు ఉందని ఆనందయ్య మరోసారి ప్రకటించారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదని, తన మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కోవిడ్ నుంచి కోలుకోవచ్చని ఆనందయ్య తెలిపారు. ఒమిక్రాన్ వణుకుపుట్టిస్తున్న వేళ ఆనందయ్య తన మందును మరోసారి బయటకు తెచ్చారు.

పనిచేయదంటున్న ఆయుష్....
అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ మందుకు అనుమతి లేదని చెబుతున్నారు. ఆయుష్ శాఖ దీనిని ఆయుర్వేద మందుగా పరిగణించడం లేదని తెలిపింది. ప్రజలు ఎవరూ దీనిని నమ్మి మోసపోవద్దని ఆయుష్ శాఖ తెలిపింది. ఆ మందు పనిచేస్తుందని ఎటువంటి ఆధారాలు లేవని ఆయుష్ శాఖ చెబుతుంది. ఆనందయ్య మాత్రం తన పసరు మందు పనిచేస్తుందని చెబుతున్నారు. ఆనందయ్య ఇచ్చే కంటి మందు వల్ల ప్రమాదం ఉందని, మిగిలిన పసరుమందుతో ఎలాంటి ప్రమాదం లేదని ఆయుష్ శాఖ తెలిపింది. వారు తమ శాఖకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి నిబంధనలకు లోబడి అనుమతిస్తామని ఆయుష్ శాఖ వెల్లడించింది. తాను ప్రజలకు ఉచితంగా మందు ఇస్తున్నానని, ఎవరిని మోసం చేయడం లేదని ఆనందయ్య చెబుతున్నారు.








Tags:    

Similar News