Chandrababu: వారికి చంద్రబాబు బుజ్జగింపులు.. ఎందుకంటే..

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు..

Update: 2024-03-07 02:30 GMT

Chandrababu

Chandrababu:ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అటు అధికార పార్టీ అయిన వైసీపీ నేతల తమదైన శైలిలో ముందుకు వెళ్తుండగా, ఇక ధీటుగా ఎదుర్కొనే టీడీపీ పార్టీ కూడా కొత్త వ్యూహాలు రచిస్తోంది. మొదటి విడతలో 94 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించగా, జనసేన పార్టీ 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించారు .మొత్తం 24 స్థానాల్లోనూ ఐదు స్థానాలకు అభ్యర్థులు ఎంపికను పూర్తి చేసింది జనసేన. ఆయా అభ్యర్థుల వివరాలను స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మిగిలిన 19 మంది అభ్యర్థులపై పవన్ కళ్యాణ్ త్వరలో ప్రకటించనున్నారు. అయితే మొదటి జాబితాలో టికెట్‌ దక్కనివారికి చంద్రబాబు బుజ్జగించే పనిలో పడ్డారు.

టికెట్‌ దక్కని ఆశవాహలు ఒక్కొక్కరుగా చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్నారు. టిడిపికే కాకుండా జనసేనకు టికెట్లు కేటాయించిన స్థానాల్లోని మహిళతోపాటు టిడిపిలో ఒకరి కంటే ఎక్కువ ఆశావహులకు ఉన్న స్థానాల్లోని అభ్యర్థులను కూడా పిలిపించి స్వయంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. టికెట్‌ రాని వారు ఎలాంటి టెన్షన్‌ పడవద్దని వారిని బుజ్జగింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదో విధంగా వారికి సర్జి చెప్పి పంపిస్తున్నారట. ఇక బుధవారం మరి కొంతమంది ఆశావహులు చంద్రబాబుతో భేటీ అయ్యారు.

అనకాపల్లి టీడీపీ ఇన్ చార్జి పీలా గోవింద్ చంద్రబాబును కలిశారు. ఇప్పటికే అనకాపల్లి టిక్కెట్లు జనసేన కేటాయించారు. దీంతో పీలా గోవింద్ కు చంద్రబాబు సర్ది చెప్పారు. మాజీ మంత్రులు కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ లు కూడా చంద్రబాబుతో విడివిడిగా భేటీ అయ్యారు. 


Tags:    

Similar News