Chandrababu : చంద్రబాబు అన్నది ఆ మంత్రులను గురించేనా? పార్టీలో హాట్ టాపిక్

ముఖ్యమంత్రి చంద్రబాబు గత నాలుగు రోజుల నుంచి అలుపెరగకుండా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మంత్రులకువార్నింగ్ ఇచ్చారు

Update: 2024-09-04 07:37 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత నాలుగు రోజుల నుంచి అలుపెరగకుండా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పడవల్లో ప్రయాణించారు. బాధితులను పరామర్శించారు. వాహనాలు వెళ్లలేని ప్రాంతాలకు జేసీబీ కూడా ఎక్కి ఆయన బాధితులను అడిగి అందుతున్న సాయంపై ఆరా తీశారు. బస్సులోనే పడుకుంటూ రేయింబవళ్లూ వరద సహాయక చర్యలను చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు వరద సహాయక కార్యక్రమాలను చూసుకుంటూ, మరొక వైపు అధికారులతో సమీక్షలను నిర్వహిస్తూ, ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతూ అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. ఏడు పదుల వయసులో ఆయన కష‌్టపడుతున్న తీరును అందరూ మెచ్చుకుని తీరాల్సిందే.

విజయవాడకు రాకుండా?
కానీ మంత్రులు మాత్రం కొందరు విజయవాడ వైపు తొంగి చూడలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కృష్ణా జిల్లా బాగా ఎఫెక్ట్ అయింది. అందులోనూ విజయవాడ బాగా దెబ్బతినింది. విజయవాడ కోలుకునేందుకు చాలా సమయం పడుతుంది. ప్రజలు సర్వస్వం కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. వారు ఏమీ కోరడం లేదు. తమకు తాగునీరు, పాలు, ఆహారం అందించమని వేడుకుంటున్నారు. అయితే కొందరు మంత్రులు, అధికారులు దగ్గరుండి బాధితులను ఆదుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్ వంటి వారు బాధితుల వద్దకు వెళ్లి కొంతమేర వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మంత్రుల నిర్లక్ష్యంపై...
నారా లోకేష్ వంటి మంత్రులు కమాండ్ కంట్రోల్ రూంలో ఉండి వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే అయితే టీడీపీకి చెందిన మిగిలిన మంత్రుల జాడ కనిపించడం లేదు. ఇప్పటికే చంద్రబాబు మంత్రులతో, అధికారులతో వార్డుల వారీగా కమిటీలను ఏర్పాటుచేశారు.అయితే ఆ కమిటీలో లేని మంత్రులు కూడా కనీసం వరద పరిస్థితులను తెలుసుకోవాలన్న ప్రయత్నం చేయకపోవడంపై చంద్రబాబు మండిపడుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే పనిచేయని మంత్రులు తమకు అవసరం లేదని, వారిని కేబినెట్ నుంచి తొలగిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారంటే చంద్రబాబు ఎంత విసిగిపోయి ఆ కామెంట్స్ చేశారో అర్థం చేసుకోవచ్చు.
వీరంతా ఎక్కడ?
మరోవైపు జనసేన, బీజేపీకి చెందిన మంత్రులు కూడా కనిపించక పోవడం చర్చనీయాంశమైంది. వీరు ఇతర ప్రాంతాల్లో తిరుగుతున్నారో తెలియదు కానీ బెజవాడలో మాత్రం కనిపించలేదు. పవన్ కల్యాణ్ పట్టణంలో లేకపోవడంతో ఆయనను వదిలేసినా మిగిలిన మంత్రుల మాటేమిటన్న ప్రశ్న తలెత్తుంది. నిన్న వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ వరద పరిస్థితిపై సమీక్షించారు. కోటి రూపాయలు తన వంతుగా విరాళాన్ని కూడా ప్రకటించారు. దీంతో పాటు రాయలసీమకు చెందిన టీడీపీ మంత్రులు మాత్రం విజయవాడకు రాకుండా ముఖం చాటేశారని చెబుతున్నారు. వీరందరినీ ఉద్దేశించే చంద్రబాబుఈ కామెంట్స్ చేశారని అంటున్నారు. మంత్రులందరూ ఎవరి శాఖల పనిని వారుచేసుకుంటూ, ఆ యా శాఖలకు సంబంధించిన అధికారులను సమన్వయం చేసుకోవాల్సిన సమయంలో ఇలా వ్యవహరించడం సరికాదన్న అభిప్రాయం ముఖ్యమంత్రిలో బలంగా ఉంది. అందుకే ఆయన హార్ష్ గా కామెంట్స్ చేశారంటున్నారు.


Tags:    

Similar News