Breaking : పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పనిచేయని మంత్రులు తమకు అవసరం లేదని ఆయన అన్నారు.;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పనిచేయని మంత్రులు తమకు అవసరం లేదని ఆయన అన్నారు. వారిని మంత్రి వర్గం నుంచి కూడా తొలగిస్తానని తెలిపారు. పని చేయని వారు తమకు అక్కరలేదని ఆయన తెలిపారు. మంత్రులైనా, అధికారులైనా ఒకే చర్య ఉంటుందని ఆయన తెలిపారు.
అధికారిపై సస్పెన్షన్ వేటు...
జక్కంపూడిలో ఒక అధికారిని సస్పెండ్ చేసిన చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు. చంద్రబాబు వరద ఇంకా ఉన్న జక్కంపూడి ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా తమకు ఆహారం, మంచినీరు అందలేని బాధితులు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. సహాయక చర్యల్లో అలస్వతం వదిలిస్తే ఎవరినీ వదలబోమని ఆయన హెచ్చరించారు.