Vijayawada : విజయవాడకు నేడు భువనేశ్వరి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేడు విజయవాడ రానున్నారు;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేడు విజయవాడ రానున్నారు. విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను త్వరలో నిర్మించనున్నారు. ఏపీలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సేవలను విస్తృతం చేయాలని భావించి విజయవాడలో స్థల సేకరణ జరిపారు. నేడు దానికి భూమి పూజ చేయనున్నారు. సఈ శంకుస్థాపన కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొంటారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ శంకుస్థాపనకు...
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంది. దీంతో నూతన రాష్ట్రమైన ఏపీలోనూ ట్రస్ట్ భవన్ ను నెలకొల్పి ఇక్కడి నుంచి వివిధ రకాల సేవలను అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ట్రస్ట్ భవనాన్ని నిర్మించనుంది. ఈ భవన నిర్మాణం అత్యంత వేగంగా పూర్తి చేసుకుని వీలయినంత త్వరగా సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు.