Ys Sharmila : దక్షిణాదికి ఎన్నిసీట్లు ఉంటాయో తెలిస్తే?

డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు;

Update: 2025-03-22 06:30 GMT
ys sharmila, apcc cheif, delimitation,  southern states
  • whatsapp icon

డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదని కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ప్రజల హక్కుల కోసం చేసే పోరాటంగా ఆమె అభివర్ణించారు. జనాభా ప్రాతిపదికన సీట్లను విభజిస్తే దక్షిణాదికి జరిగేది తీరని నష్టమేనన్న షర్మిల ఉత్తరాది ప్రాబల్యం మరింతగా పెరిగి.. సౌత్ రాష్ట్రాల ప్రాధాన్యతతో పనిలేకుండా పోతుందని, సొమ్ము సౌత్ ది..సోకు నార్త్ ది అనే పరిస్థితి ఎదురుకాక తప్పదని షర్మిల అన్నారు. డీలిమిటేషన్ పేరుతో లిమిటేషన్ ఫర్ సౌత్‌లా చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

జనాభా ప్రాతిపదికన...
జనాభా ప్రాతిపదికన పునర్విభజనను అంగీకరించే ప్రసక్తే లేదని, కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత విధానంతో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 143 సీట్లకు పెరిగితే దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ లాంటి ప్రధాన రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కలిపి ఉండే సీట్లు 144 మాత్రమేనని అన్నారు. ఇది కాదా వివక్ష చూపడం అంటే ? యూపీ,బీహార్ రెండు రాష్ట్రాలు కలిపితే 222 సీట్లు పెరిగితే సౌత్ మొత్తం తిప్పి కొట్టినా 192 సీట్లకే పరిమితమవుతుందని తెలిపారు. ఇది కాదా దక్షిణ భారతంకి జరిగే అన్యాయం ? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల పోరాటానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు.


Tags:    

Similar News