ఏపీలో పది రోజులే పాఠశాలలకు సెలవు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించింది. సెప్టంబరు 26వ తేదీ నుంచి అక్టోబరు 1వ తేదీ వకూ సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 6వ తేదీన తిరిగి స్కూళ్లు ప్రారంభం కానున్నాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
అక్టోబరు 6 నుంచి...
పది రోజులు మాత్రమే దసరా సెలవులు ప్రకటించింది. ఏపీలో సంక్రాంతిని పెద్ద పండగగా భావిస్తుండటంతో దసరా సెలవులను కొంత తగ్గిస్తూ రావడం సాధారణం. ఇక ఆంధ్రప్రదేశ్ లో మైనారిటీ విద్యాసంస్థలకు అక్టోబరు 1 నుంచి ఆరో తేదీ వరకూ సెలవులు ప్రకటించింది. ఈ విద్యాసంవత్సంర పాఠశాలకు 220 పనిదినాలు, 80 సెలవుదినాలుగా ప్రభుత్వం పేర్కొంది.