Andhra Pradesh : బిల్ గేట్స్ తో బాబు సమావేశం తర్వాత?
గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపిన చర్చలు ఫలించాయి.;

గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపిన చర్చలు ఫలించాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి గేట్స్ ఫౌండేషన్ అంగీకరించింది. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్స్ కు, ఏపీ సర్కార్ కు మధ్య ఒప్పందం కుదిరింది. వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, మెడ్ టెక్ రంగాల్లో కలసి పనిచేయాలని నిర్ణయించారు.
ఒప్పందం కుదరడంతో...
ఇరువర్గాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదరడంతో ఏపీలో బిల్ గేట్స్ ఫౌండేషన్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ రంగాల్లోని సమస్యలకు పరిష్కారం కనుక్కొనడమే కాకుండా వాటిని వినియోగంలోకి తెచ్చేలా ఈ ఒప్పందం ఉపయోగపడతుందని భావిస్తున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఇది మంచి అవకాశమని చెబుతున్నారు. ఏఐ, శాటిలైట్ ఆధారిత వ్యవస్థల ద్వారా సేద్య రంగంలో కూడా సమూల మార్పులు తీసుకు వచ్చేందుకు ఒప్పందం దోహదం చేయనుంది.