Andhra Pradesh : నిష్ణాతులను గౌరవ సలహాదారులుగా నియమించిన ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా నియమించింది;

Update: 2025-03-20 01:55 GMT
government, appointed,  advisors, andhra pradesh
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ గౌరవ సలహాదారుగా డీఆర్డీవో మాజీ చీఫ్ జి.సతీష్ రెడ్డి ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏరో స్పెష్, ఢిపెన్స్ మ్యానుఫేక్చరింగ్ హబ్ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. కేబినెట్ ర్యాంక్ హోదాతో రెండేళ్లు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వులలో పేర్కొంది.

వివిధ రంగాల్లో...
ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో పనిచేస్తున్న సోమనాథ్ కు పాలనా వ్యవహారాలు, పరిశ్రమలు, పరిశోధనలో సలహాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. స్మార్ట్ సిటీస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్లో స్పేస్ టెక్నాలజీని అనుసంధానించాలని ప్రభుత్వం కోరింది. భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లాను సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత, హస్తకళల అభివృద్ధికి సంబంధించి గౌరవ సలహాదారుగా నియామకం చేసింది. ఏపీ ఫోరెన్సిక్ గౌరవ సలహాదారుగా కేవీపీ గాంధీని నియమించింది. ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ గౌరవ సలహాదారుగా కేవీపీ గాంధీ నియామకం జరిగింది.


Tags:    

Similar News