Andhra Pradesh : నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేటితో ముగియనున్నాయి.;

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. దాదాపు పదిహేను రోజుల పాటు కొనసాగిన బడ్జెట్ సమావేశాల్లో అనేక అంశాలపై చర్చించారు. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయిన బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈరోజు ఎస్సీ కమిషన్ నివేదికపై కీలక చర్చ జరిపి సభ దానిని ఆమోదించే అవకాశముంది.
ఈ సమావేశాల్లో...
ఈ పదిహేను రోజుల సమావేశాల్లో వివిధ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టి ఆమోదించుకుంది. దీంతో పాటు వివిధ కీలక అంశాలపై చర్చ జరిపింది. స్వల్ప కాలి, దీర్ఘకాలిక చర్చలు జరిపింది. ఈరోజుతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడాపోటీలు ముగియనున్నాయి. ఈ పోటీల్లో విజేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహుమతులను ప్రదానం చేయనున్నారు.