Pawan Kalyan : నేడు కర్నూలు జిల్లాకు పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు;

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి ఆయన కర్నూలు జిల్లాకు బయలుదేరి వెళతారు. కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గాన బయలుదేరి పూడిచెర్ల చేరుకోనున్నారు. పూడిచెర్లలో ఫారం పాండ్స్ నిర్మాణానికి భూమి పూజను పవన్ కల్యాణ్ చేయనున్నారు.
భూమిపూజను నిర్వహించి...
అక్కడ భూమి పూజను నిర్వహించిన తర్వాత జరగనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. బహింగ సభకు ఇప్పటికే పార్టీ నేతలు ఏర్పట్లు చేశారు. పవన్ కల్యాణ్ పూడిచెర్లకు వస్తుండటంతో పెద్దయెత్తున అభిమానులు తరలి వస్తారని భావించి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బహిరంగ సభ తర్వాత ఆయన కర్నూలు నుంచి నేరుగా బయలుదేరి హైదరాబాద్ కు చేరుకుంటారు.