ఎవరినీ అరెస్ట్ చేయలేదు.. హోంమంత్రి
ఉద్యోగ సంఘాల నేతలను ఎవరినీ అరెస్ట్ చేయలేదని హోంమంత్రి సుచరిత చెప్పారు;
ఉద్యోగ సంఘాల నేతలను ఎవరినీ అరెస్ట్ చేయలేదని హోంమంత్రి సుచరిత చెప్పారు. కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయని మాత్రమే చెప్పామన్నారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి కార్యక్రమాలు చేపడితే రాష్ట్రంలో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశముందని సుచరిత ఆందోళన వ్యక్తం చేశారు.
చర్చల ద్వారానే......
పోలీసులు ఎలాంటి ఉక్కు పాదం ఉద్యోగులపై మోపలేదని చెప్పారు. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని మేకతోటి సుచరిత చూసించారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని చెప్పారు. ఎవరినీ ముందస్తు అరెస్ట్ లు చేయలేదని, కోవిడ్ నిబంధనలను మాత్రమే పాటించాలని తాము సూచించామని తెలిపారు.