ఏపీలో నేడు 99 అన్నా క్యాంటిన్లు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు అన్నా క్యాంటిన్లు ప్రారంభమయ్యాయి.;
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు అన్నా క్యాంటిన్లు ప్రారంభమయ్యాయి. అన్ని నియోజవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అన్నా క్యాంటిన్లను ప్రారంభించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నులకపేటలో మంత్రి నారా లోకేష్ అన్నా క్యాంటిన్ ను ప్రారంభించారు. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ ఈ క్యాంటిన్ ను ప్రారంభించి పేదలకు స్వయంగా వడ్డించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటిన్లను వివిధ నియోజకవర్గాల్లో ప్రారంభిచారు.
మూడు పూటలా...
నిన్న గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా అన్నా క్యాంటిన్ ను ప్రారంభించిన నేపథ్యంలో నేడు అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు రిబ్బన్ కట్ చేశారు. నారా లోకేష్ స్వయంగా అన్నా క్యాంటిన్ కు వచ్చిన వారికి అల్పాహారం వడ్డించారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఐదు రూపాయలకే అందిస్తుండటంతో పేదలకు ఈ అన్నా క్యాంటిన్లు వరంగా మారతాయని లోకేష్ తెలిపారు.