ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు
ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మహిళకు ఒమిక్రాన్ వేరియంట్ గా నిర్ధారణ అయింది;
ఆంధ్రప్రదేశ్ లో మరో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మహిళకు ఒమిక్రాన్ వేరియంట్ గా నిర్ధారణ అయింది. ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో ఒమిక్రాన్ వేరియంట్ అని తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 17కు చేరుకుంది.
కాంటాక్ట్ అయిన వారికి....
ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. ఐదు జిల్లాల్లో ఈ కేసులు వెలుగు చూశాయి. ప్రకాశం జిల్లాలో ఒమిక్రాన్ సోకిన మహిళ కాంటాక్ట్ అయిన పథ్నాలుగు మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని, వారికి నెగిటెవ్ వచ్చిందని వైద్య అధికారులు తెలిపారు.