Chandrababu : ముందస్తు బెయిల్ విచారణ రేపటికి వాయిదా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ విచారణ రేపటికి వాయిదా పడింది;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ విచారణ రేపటికి వాయిదా పడింది. హైకోర్టులో కొద్దిసేపటి క్రితం విచారణ జరిపిన న్యాయస్థానం రేపటికి వాయిదావేసింది. మద్యం కేసులో భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండి పండిందని చంద్రబాబుపైన, అప్పటి మంత్రి కొల్లు రవీంద్రపైన ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు, కొల్లు రవీంద్రలు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
ఇసుక కేసులో...
దీనిపై విచారణను రేపటికి హైకోర్టు వాయిదా వేసింది. అలాగే ఇసుప పాలసీ కేసులోనూ చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ ను ఎల్లుండి విచారణకు వాయిదా వేస్తే ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. నాటి ప్రభుత్వం విధానం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని సీఐడీ ఆరోపించింది. కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు పీతల సుజాత, దేవినేని ఉమలతో పాటు చింతమనేని ప్రభాకర్ లపై కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.