జగన్ వారందరికీ భరోసా
ఈ ప్రభుత్వం చిరు వ్యాపారులకు అండగా నిలిచిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు.
ఈ ప్రభుత్వం చిరు వ్యాపారులకు అండగా నిలిచిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. జగనన్న తోడు పథకం ద్వారా చిు వ్యాపారులను ఆదుకుంటున్నామని తెలిపారు. తన పాదయాత్ర లో చిరు వ్యాపారుల బాధను దగ్గరుండి చూశానని, అందుకోసమే ఈ పథకాన్ని రూపొందించామని తెలిపారు. వడ్డీ లేని రుణాలను అందించేందుకు నిర్ణయించామని తెలిపారు. ఈరోజు చిరు వ్యాపారులకు 395 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తున్నామని తెలిపారు. జగనన్న తోడు పథకం కింద నిధులను విడుదల చేస్తూ లబ్దిదారులతో మాట్లాడారు.
పూర్తి వడ్డీ భారాన్ని...
పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని జగన్ తెలిపారు. సక్రమంగా రుణం చెల్లించిన వ్యాపారులకు వడ్డీ మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పెట్టుబడి కష్టం కావద్దనే ఈ పథకాన్ని తెచ్చామని జగన్ తెలిపారు. ఈ పథకం ద్వారా 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు లబ్ది పొందుతున్నారన్నారు. ఇందులో ఎనభై శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలేనని తెలిపారు. అట్టడుగున ఉన్న జీవితాలు బాగుపడాలంటే ఎలాంటి హామీలేకుండా రుణం మంజూరు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. అర్హత ఉన్న వారికి ఈ పథకం అందకపోతే మళ్లీ అందిస్తామని తెలిపారు.