Andhra Pradesh : నేడు ఏపీలో పిడుగులు పడే అవకాశమున్న ప్రాంతాలివే

అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Update: 2024-07-18 02:02 GMT

అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో ఈరోజు రేపు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. మధ్యప్రదేశ్ తీర పరిసర ప్రాంతం మీదుగా కొనసాగుతున్న అల్పపీడనంతో పాటు దీనికి అనుబంధంగా విస్తరించి ఉన్న ఆవర్తనం ప్రభావంతో నేడు, రేపు కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలినచోట్ల విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

బలమైన ఈదురుగాలులు...
ఈ సందర్భంగా బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, పొలాల్లో పనిచేసే నేడు అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం,మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి,కాకినాడ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.


Tags:    

Similar News