Good News To Farmers: ఏపీలో రైతులకు గుడ్ న్యూస్.. అందుకు గడువు పెంపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్

Update: 2024-09-15 11:22 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఖరీఫ్‌ సీజన్‌ పంటలకు ఈ-క్రాప్‌ నమోదు గడువును ప్రభుత్వం పొడిగించింది. మొదట సెప్టెంబర్ 15 వరకు గడువు విధించారు. అయితే ఇంకా చాలా మంది రైతులు నమోదు చేసుకోలేదు. దీంతో ప్రభుత్వం నమోదు గడువును సెప్టెంబర్ 30 వరకు పెంచింది. ఈ-క్రాప్‌ నమోదు చేస్తేనే పంటల బీమా అమలు అవుతుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. పిఎంఎఫ్‌బివై వాతావరణ ఆధారిత పంటల బీమాను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఖరీఫ్‌ కాలానికి ఎంపిక చేసిన పంటలకు ఉచితంగా బీమా కల్పిస్తుండగా, రబీకి రైతులు బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

పంటల బీమాతో పాటుగా, ఇన్‌పుట్ సబ్సిడీ, పంట కొనుగోలుకు ఈ క్రాప్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో పంటలు సాగుచేసిన రైతులు అందరూ తప్పనిసరిగా ఈ- క్రాప్‌లో పంటల వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News