బ్రేకింగ్ : ఏపీలో 1200పైగా కోవిడ్ కొత్త కేసులు

ఏపీలో కరోనా కల్లోలం రేపుతోంది. రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి ఎక్కువవుతోంది. రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. వరుసగా రెండ్రోజులు 800 కు పైగా కేసులు నమోదవ్వగా.. తాజాగా;

Update: 2022-01-09 12:26 GMT

ఏపీలో కరోనా కల్లోలం రేపుతోంది. రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి ఎక్కువవుతోంది. రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. వరుసగా రెండ్రోజులు 800 కు పైగా కేసులు నమోదవ్వగా.. తాజాగా 1200కి పైగా కొత్తకేసులు బయటపడ్డాయి. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కోవిడ్ బులెటిన్ లో 1257 కేసులు వెల్లడయ్యాయి. గడిచిన 24 గంటల్లో 38,479 కోవిడ్ శాంపిల్స్ ను పరీక్షించగా.. అత్యధికంగా విశాఖలో 196 కేసులు బయటపడ్డాయి. అనంతపురంలో 138, కృష్ణాజిల్లాలో 117, గుంటూరు జిల్లాలో 104, నెల్లూరు జిల్లాలో 103 కేసులు నమోదయ్యాయి.

ఇక ఇదే సమయంలో 140 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. మరో ఇద్దరూ కోవిడ్ తో మరణించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 20,81,859కి పెరిగింది. వీరిలో 20,62,580 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలో 4,774 యాక్టివ్ కేసులున్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్లలో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ మృతుల సంఖ్య 14,505కి పెరిగింది.


Tags:    

Similar News