Earth Quake : అరుణాచల్ ప్రదేశ్‌లో వరసగా భూకంపాలు.. భయంతో
అరుణాచల్ ప్రదేశ్ లో వరసగా రెండుసార్లు భూకంపం సంభవించింది.;

earthquake, magnitude, richter scale, Manipur
అరుణాచల్ ప్రదేశ్ లో వరసగా రెండుసార్లు భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారు జామున ఈ వరస భూకంపాలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు తెలిపారు. మొదటి భూకంపం ఉదయం 1.49 గంటలకు నమోదయింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.7 గా నమోదయిందని అధికారులు తెలిపారు.
రెండో భూకంపం...
రెండో భూకపం కూడా వెంటనే సంభవించడంతో ప్రజలు భయపడి ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం మేరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని, ఇళ్లకు పగుళ్లు మాత్రం వచ్చాయని అధికారులు తెలిపారు. వరసగా రెండు భూకంపాలు సంభవించడంతో ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ లోని కొండ ప్రాంతాల్లో నివసించే వారు ఆందోళన చెందుతున్నారు.