Breaking : టీడీపీ సభ్యుల సస్పెన్షన్
వాయిదా తర్వాత అసెంబ్లీ తిరిగి ప్రారంభమయింది.ప్రారంభమైన వెంటనే స్పీకర్ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు;
వాయిదా తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తిరిగి ప్రారంభమయింది. సభ ప్రారంభం అయిన వెంటనే స్పీకర్ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకరోజు పాటు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. మొత్తం పదకొండు మంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. సభ ప్రారంభం కాగానే టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. జీవో నెంబరు వన్ పై తాము ఇచ్చిన వాయిదా తీర్మానం పై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అందుకు స్పీకర్ ఒప్పుకోకపోవడంతో నినాదాలకు దిగారు.
పదకొండు మంది...
అయితే ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో సభ వాయిదా పడింది. తిరిగి ప్రారంభమయిన వెంటనే టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో స్పీకర్ పోడియం వద్దనే టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీనిపై మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ సభలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అని ఆయన అన్నారు. సభ ప్రారంభమయిన వెంటనే ప్రశ్నోత్తరాలు జరగకుండా అడ్డుకుంటుడటం ఒక తమాషాగా మారిపోయిందన్నారు.