సీఎం జగన్ కార్యాలయానికి బాలినేని

సజ్జల నచ్చజెప్పడంతో బాలినేని తన నివాసం నుంచి జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఆయనతో తలశిల రఘురామ్,;

Update: 2022-04-11 11:29 GMT
సీఎం జగన్ కార్యాలయానికి బాలినేని
  • whatsapp icon

తాడేపల్లి : ఏపీ కొత్తమంత్రి వర్గంలో తనకు స్థానం దక్కకపోవడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రమనస్తాపానికి గురైన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అలకబూనిన ఆయన.. ఒక మెట్టు దిగారు. సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మూడు దఫాలుగా బాలినేని ఇంటికి వెళ్లి జరిపిన చర్చలు ఫలించినట్లే కనిపిస్తోంది. సజ్జల నచ్చజెప్పడంతో బాలినేని తన నివాసం నుంచి జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.

ఆయనతో తలశిల రఘురామ్, అప్పిరెడ్డిలు కూడా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే బాలినేని సహా వీరంతా జగన్ కార్యాలయానికి చేరుకున్నారు. అసంతృప్తితో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డితో సీఎం జగన్ స్వయంగా మాట్లాడనున్నారు. జగన్ తో సమావేశం అనంతరం బాలినేని తన తదుపరి కార్యాచరణ ఏంటో ప్రకటిస్తారని సమాచారం.


Tags:    

Similar News