నేడు ఏపీ, తెలంగాణలో విద్యాసంస్థల బంద్
రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు విద్యాసంస్థల బంద్ జరగనుంది. ఏపీలో పాఠశాలలు బంద్ చేయాలని విద్యార్థి సంఘలు పిలుపునిచ్చాయి
రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు విద్యాసంస్థల బంద్ జరగనుంది. ఏపీలో నేడు కళాశాలలు, పాఠశాలలు బంద్ చేయాలని విద్యార్థి సంఘలు పిలుపునిచ్చాయి. పాఠశాలలు మొదలయినా ఇంతవరకూ పుస్తకాలు, యూనిఫారంలు ఇవ్వలేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అదే విధంగా పెండింగ్ లో ఉన్న వసతి దీవెన, విద్యా దీవెన బకాయీలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఈరోజు విద్యాసంస్థలను బంద్ చేయాలని అన్ని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
కార్పొరేట్ కళాశాలలను...
తెలంగాణలో మాత్రం మరో డిమాండ్ తో ఏబీవీపీ విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చింది. కార్పొరేట్ కళాశాలలను తెలంగాణలో నియంత్రించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కొన్ని కార్పొరేట్ కళాశాలల యాజమాన్యానికి కొమ్ముకాస్తుందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇంటర్ బోర్డు పర్యవేక్షణ లేకపోవడంతోనే తెలంగాణలో కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి అధిక ఫీజలు వసలూు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కార్పొరేట్ కళశాలలను నియంత్రించాలని డిమాండ్ కోరుతూ బంద్ కు పిలుపునిచ్చాయి.