విశాఖలో ప్రధాని రోడ్ షో

ఈ నెల 11న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంకు రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు;

Update: 2022-11-07 06:37 GMT

ఈ నెల 11న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంకు రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఆయన 11 సాయంత్రం 6.25 గంటలకు విశాఖకు చేరుకుంటారని తెలిపారు. అయితే ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. తాము రెండు రూట్లను ఖరారు చేసి కేంద్ర పార్టీకి పంపామని తెలిపారు. అయితే కేంద్ర పార్టీ ఎలా నిర్ణయిస్తే ఆ మేరకు రోడ్ షో జరుగుతుందని చెప్పారు.

బహిరంగ సభలో...
ఒక ఎన్ఐడీ వద్ద పాత ఐఐటీ నుంచి రెండో బీచ్ రోడ్ నుంచి అని తాము కేంద్ర పార్టీకి పంపామని సోము వీర్రాజు తెలిపారు. 12వ తేదీ ఉదయం ఆంధ్రయూనివర్సిటీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. అనేక పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను ప్రధాని మోదీ చేస్తారని సోము వీర్రాజు చెప్పారు. కొన్ని ప్రాజెక్టులను దేశానికి అంకితం చేస్తారన్నారు. మధ్యాహ్నం బయలుదేరి ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళతారన్నారు.


Tags:    

Similar News