రోశయ్యకు ప్రముఖుల నివాళులు
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పార్ధీవ దేహాన్ని మరికాసేపట్లో గాంధీ భవన్ కు తరలించనున్నారు.;
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పార్ధీవ దేహాన్ని మరికాసేపట్లో గాంధీ భవన్ కు తరలించనున్నారు. రోశయ్య పార్థీవ దేహానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు నివాళులర్పించారు. రోశయ్య అంత్యక్రియలకు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే హజరుకానున్నారు. గాంధీభవన్ లో రోశయ్య పార్థీవ దేహాన్ని ఉంచడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
ఏపీ ప్రభుత్వం తరుపున....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాసులురెడ్డి రోశయ్య అంత్యక్రియలకు హాజరుకానున్నారు. మరికాసేపట్లో రోశయ్య పార్థీవ దేహాన్ని గాంధీ భవన్ కు తరలించనున్నారు. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు మధ్యాహ్నం ఒంటిగంటకు కొంపల్లిలోని ఫాం హౌస్ లో జరగనున్నాయి.