Chandrababu : ఫెంగల్ తుపాను పై చంద్రబాబు కీలక ఆదేశాలు
ఫెంగల్ తుపాను పై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు;
ఫెంగల్ తుపాను పై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆయన జిల్లా కలెక్టర్లు, రియల్ టైం గవర్నెన్స్, విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి అనుగుణంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలన్న ముఖ్యమంత్రి. చంద్రబాబు అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఆకస్మిక వరదలు వస్తే...
ఫెంగల్ తుఫాన్ కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయనే సమాచారం నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ టీంను సిద్ధంగా ఉంచుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందునుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సమాయాత్తం కావాలని జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ పై ధాన్యం రైతులు ఆందోళనగా ఉన్నారని, నిర్ధిష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలన్న ముఖ్యమంత్రి అధికారులను కోరారు.