కేంద్రం పోలవరానికి వరాలు ప్రకటించింది : చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు
పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీ అభివృద్ధికి ఊతమిచ్చేలా కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఉన్నాయన్నారు. పోలవరానికి విడతల వారీగా నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిర్వాసితులకు నష్ట పరిహారం కూడా అందిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపిందన్నారు.
అన్నీ ఆటంకాలే...
పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని ఆటంకాలు వచ్చాయో అన్ని వచ్చాయన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంట్రాక్టర్లను మార్చడం వల్ల ప్రాజెక్టు పురోగతి లో ఇబ్బందిగా మారిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులను ఇచ్చిందన్నారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర సహకారంతోనే పోలవరాన్ని వీలయినంత త్వరగా పూర్తి చేసి ఏపీ ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తామని చంద్రబాబు తెలిపారు.