అర్ధరాత్రి అశోక్ బాబుకు బెయిల్... విడుదల

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన విడుదలయ్యారు

Update: 2022-02-12 01:12 GMT

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన విడుదలయ్యారు. విద్యార్హతలపై తప్పుడు ధృవీకరణ సర్టిఫికేట్లు పెట్టారంటూ ఏపీ సీఐడీ అశోక్ బాబుపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. లోకాయుక్త ఆదేశం మేరకు అశోక్ బాబుపై కేసు నమోదు చేసిన సీఐడీ గురువారం అర్ధరాత్రి ఆయనను అరెస్ట్ చేసింది. ఆయనను గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఉంచి విచారణ జరిపింది.

పూచీకత్తుపై.....
ఆ తర్వాత నిన్న రాత్రి సీఐడీ ఇన్ ఛార్జి న్యాయమూర్తి ఎదుట అశోక్ బాబును సీఐడీ పోలీసులు హాజరు పర్చారు. అయితే కక్షపూరిత ధోరణితోనే అరెస్ట్ చేశారని, తొలుత అశోక్ బాబుపై బెయిలబుల్ సెక్షన్ పెట్టిన సీఐడీ పోలీసులు తర్వాత 467 సెక్షన్ పెట్టారంటూ అశోక్ బాబు తరుపున న్యాయవాదులు వాదించారు. అశోక్ బాబు ఆరోగ్యం బాగా లేదని, ఆయన గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స ఇటీవల చేయించుకున్నారని ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
అర్ధరాత్రి విడుదల....
దీంతో సీఐడీ కోర్టు అశోక్ బాబుకు బెయిల్ మంజూరు చేసింది. ఇరవై వేల చొప్పున ఇద్దరి జామీనుఇవ్వాలలని కోరింది. జామీను సమర్పించిన అశోక్ బాబు తర్వాత విడుదలయ్యారు. తన అరెస్ట్ కు పీఆర్సీ సాధన సమితిలోని కొందరు సభ్యులున్నారని అశోక్ బాబు ఆరోపించారు.


Tags:    

Similar News