అర్ధరాత్రి అశోక్ బాబు అరెస్ట్
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను అర్ధరాత్రి సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను అర్ధరాత్రి సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అశోక్ బాబును న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చినట్లు తెలిసింది. అయితే అశోక్ బాబుపై లోకాయుక్త ఆదేశం మేరకు ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అశోక్ బాబు విద్యార్హతను తప్పుగా చూపించి పదోన్నతులు పొందారన్న ఆరోపణలున్నాయి.
తప్పుడు విద్యార్హతలతో....
దీనిపై అందిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త విచారణకు ఆదేశించింది. అశోక్ బాబు డీకాం చదివి బీకాం చదివినట్లు ఫోర్జరీ చేశారని విమర్శలున్నాయి. ఆయన మాత్రం అది టైపు మిస్టేక్ అని చెబుతున్నారు. అయితే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను అరెస్ట్ చేశారని అశోక్ బాబు ఆరోపిస్తున్నారు. ఎప్పటో కేసును ఇప్పుడు తీసుకువచ్చి తనను ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం చూస్తుందని అశోక్ బాబు చెబుతున్నారు. అశోక్ బాబు అర్ధరాత్రి అరెస్ట్ పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లు ఖండించారు.